గుంటూరు: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.మంగళవారం ఆయన కలెక్టర్.. రూరల్,అర్బన్ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించవద్దని మంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోకుండా బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేయడంలో వెనకాడవద్దని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 14 చోట్ల క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌ను ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఆయా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీరంగనాథరాజు సూచించారు.
కరోనా నివారణ చర్యలపై మంత్రి టెలి కాన్ఫరెన్స్