కామారెడ్డి టౌన్: వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చిరుద్యోగులపై ఆర్థికంగా భారం వేస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతు విదేశాల నుంచి వచ్చిన వారి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతు చేతిపై ముద్ర వేయాలని వైద్యశాఖ సూచనలు ఉన్నాయి. కానీ అధికారులు స్టాంప్‌లు, ప్యాడ్‌లు, గ్లిజరిన్, డెటాల్ లాంటి వస్తువులను సమకూర్చలేదు. ఇంటింటికి తిరిగే బృందాల్లో పనిచేస్తున్న ఏఎంఎన్‌ల పైనే భారం మోపారు. స్థానిక సూపర్‌వైజర్‌లు, సీహెచ్‌వోలు, ఈ సామగ్రిని కొనుగోలు చేసి వాటికి సంబంధించిన డబ్బులను ఏఎన్‌ఎంల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే నిర్వహణ నిధుల నుంచి తీసుకొండని సూచిస్తున్నారు. దీంతో చేసేదేమి లేక ఏఎన్‌ఎంలు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారు.
చిరుద్యోగిపై ఆర్థికభారం